కాంగ్రెస్, కూటమి నేతలకు స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి విజ్ఞప్తి
- రెబెల్ అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయాలి
- మహాకూటమి స్ఫూర్తిని దెబ్బతీయొద్దు
- టికెట్ దక్కని నాయకులకు స్పష్టత నివ్వాలి
ఇదిలా ఉండగా, మహాకూటమి ద్వారా స్నేహపూర్వక పోటీకి దిగనున్న తెలంగాణ జన సమితి (టీజేఎస్)కి సీట్లు సర్దుబాటు కాకపోవడంపై ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయశాంతికి కోదండరామ్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. కామన్ మినిమ్ ప్రోగ్రాం, సీట్ల సర్దుబాటుపై చర్చించినట్టు సమాచారం.