కాంగ్రెస్ కు 60 ఏళ్లుగా సేవ చేస్తున్న మాకే అన్యాయం జరిగింది... ఇక కార్యకర్తలకు మేం ఏం చెప్పాలి?: పాల్వాయి స్రవంతి
- గత 20 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నాం
- మా నాన్న 60 ఏళ్లు కాంగ్రెస్ కు అంకితం అయ్యారు
- మునుగోడు టికెట్ ఇవ్వకపోవడంపై ఆవేదన
అలాంటి తనకే ఈసారి టికెట్ కేటాయించకుండా పార్టీ హైకమాండ్ అన్యాయం చేసిందని వాపోయారు. తమకే ఇలా జరిగితే ఇక పార్టీలో సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చెప్పాలో తనకు అర్థం కావడం లేదన్నారు. మునుగోడు టికెట్ ను పాల్వాయి స్రవంతిని కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కేటాయించిన సంగతి తెలిసిందే.