కథ వినిపించిన త్రివిక్రమ్ .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరూ?

17-11-2018 Sat 12:07 | Entertainment
  • చిరూ తదుపరి సినిమా కొరటాలతో 
  • కథను ఓకే చేయించుకున్న త్రివిక్రమ్ 
  • ఆ తరువాత లైన్లో బోయపాటి  
చిరంజీవి కోసం తనదైన స్టైల్లో ఒక మంచి కథను సిద్ధం చేసిన కొరటాల శివ, ఆ కథకు పూర్తి స్క్రిప్ట్ రూపాన్ని ఇచ్చే పనిలో బిజీగా వున్నారు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి గల క్రేజ్ ను .. ఆయన సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ఒక కథను సిద్ధం చేశాడట. ఇటీవల చిరంజీవిని కలిసి ఆ కథ వినిపించాడట.ఆ కథ నచ్చడంతో వెంటనే చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. కొరటాల తరువాత చిరంజీవి చేయబోయేది త్రివిక్రమ్ తోనేనని చెబుతున్నారు. ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. అల్లు అర్జున్ తో సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ .. చిరూ ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెడతాడట. త్రివిక్రమ్ తరువాత బోయపాటితో చిరంజీవి సినిమా వుండనుందని చెబుతున్నారు. ఈ వయసులో చిరంజీవి ఎంతమాత్రం గ్యాప్ తీసుకోకపోవడం విశేషం.  
Chiranjeevi

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more