కూకట్ పల్లిలో రెబెల్ అభ్యర్థిని నిలబెడతాం.. నందమూరి సుహాసినిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం!: స్థానిక కాంగ్రెస్ నేతల వార్నింగ్
- స్థానికులకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం
- చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
- వాటిని ఆంధ్రాలో చేసుకోవాలని హితవు
కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రెబెల్ అభ్యర్థిని నిలబెడతామనీ, సుహాసినిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు తెలంగాణలో కుట్ర రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. కుల రాజకీయాలను చంద్రబాబు ఆంధ్రాలో చేసుకుంటే మంచిదనీ, తెలంగాణలో మానుకోవాలని హితవు పలికారు.