Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ బయోపిక్ కోసం 'దాన వీర శూర కర్ణ'

  • ఎన్టీఆర్ కెరియర్లో మైలురాయి 
  • కర్ణుడిగా కనిపించనున్న బాలకృష్ణ 
  • అర్జునుడి పాత్రలో కల్యాణ్ రామ్        
క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ చిత్రీకరణ పనులు చకచకా జరుగుతున్నాయి. మొదటి భాగమైన 'కథానాయకుడు'కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతూ వస్తున్నారు. ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'దాన వీర శూర కర్ణ' ఒకటి. 1977లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని 'చిత్రం భళారే విచిత్రం' అనే పాట ఆపాతమధురాల్లో ఒకటి.

అందువల్లనే ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఈ పాటను ఈ రోజున చిత్రీకరించడం మొదలు పెట్టనున్నారు. 'దాన వీర శూర కర్ణ'లో అర్జునుడుగా హరికృష్ణ నటించారు. ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రను కల్యాణ్ రామ్ పోషిస్తున్నాడు కనుక, ఈ సినిమాలో ఆయన అర్జునుడిగా కనిపించనున్నాడు. త్వరలోనే కర్ణుడిగా బాలకృష్ణ .. అర్జునుడిగా కల్యాణ్ రామ్ కాంబినేషన్లోని ఒక సీన్ ను చిత్రీకరించనున్నారు. జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.            
balakrishna
kalyan ram

More Telugu News