శబరిమలకు వచ్చిన మహిళ, భారీ తోపులాట, కెమెరామెన్ కు గాయాలు, ఉద్రిక్తత!
- ఆలయానికి వచ్చిన 52 ఏళ్ల మహిళ
- 50 ఏళ్ల లోపేనన్న అనుమానంతో అడ్డుకున్న నిరసనకారులు
- ఆలయం వద్ద తోపులాట
ఆమె తన వయసు 52 ఏళ్లని, తన కుమారుడితో కలసి స్వామి దర్శనానికి వచ్చానని చెప్పగా, నిరసనకారులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు వినకపోవడంతో, ఆ మహిళను తమ అదుపులోకి తీసుకున్నారు. చిత్తిరాత్త తిరుణాల్ నేపథ్యంలో ఆలయాన్ని నిన్న తెరిచిన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో శబరిమలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.