పంబకు చేరుకుంటున్న అతివలు... భారీ భద్రత!
- 'సేవ్ శబరిమల' అంటున్న భక్తులు
- సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలంటున్న మహిళలు
- మహిళలకు భద్రత కల్పిస్తామంటున్న పోలీసులు
ఇప్పటికే సన్నిధానం నుంచి పంబ, నీలక్కల్ ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, భక్తులు హద్దుమీరితే కఠిన చర్యలు తప్పవని అంటున్నారు. మహిళా భక్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. మొత్తం 2,300 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ప్రకటించింది.