గాదె కింద పందికొక్కులా మారి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుని తింటున్నారు: కాంగ్రెస్ నేత శ్రవణ్
- అమ్మా బొమ్మా అంటున్న వాళ్లే గుంటనక్కలు
- సెంటిమెంట్ అనే ఆయింట్‌మెంట్ రాస్తున్నారు
- రెండు నక్కలూ ప్రగతి భవన్‌లోనే ఉన్నాయి
అమ్మా బొమ్మా అంటున్న వాళ్లే గుంటనక్కలని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పరిపాలించమని అధికారమిస్తే సెంటిమెంట్ అనే ఆయింట్‌మెంట్ రాస్తున్నారని శ్రవణ్ ఎద్దేవా చేశారు. ఒకప్పుడు తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్.. గాదె కింద పందికొక్కులా మారి తెలంగాణను దోచుకుతింటున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబమంతా సోనియా గాంధీ ఇంటికి వెళ్లి బొక్క బోర్లా పడుకుని ఆమె కాళ్లకు మొక్కి వచ్చారని శ్రవణ్ గుర్తు చేశారు.