చురుగ్గా జీఎస్ఎల్వీ-మార్క్3డి2 రాకెట్ అనుసంధాన కార్యక్రమం.. ఈనెల 14న నింగిలోకి!
- జిశాట్-29 సమాచార ఉపగ్రహాన్ని మోసుకెళ్లనున్న వాహక నౌక
- శాటిలైట్ బరువు 3600 కిలోలు
- గత ఏడాది ప్రయోగించిన జిశాట్-19తోపాటు అదనపు ప్రయోజనం
3600 కిలోల బరువున్న జిశాట్-29 సమాచార ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్ష్యలోకి మోసుకు వెళ్లనున్నది. దేశంలో సమాచార సాంకేతిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఇస్రో గత ఏడాది జిశాట్-19 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించింది. తాజాగా ప్రయోగించనున్న జిశాట్-29తో మరింత అదనపు ప్రయోజనం సమకూరనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.