కర్నూలు సైకో టీచర్ వ్యవహారంపై మంత్రి గంటా ఆగ్రహం.. ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు!
- ప్రేమించాలని టీచర్ శంకర్ వేధింపులు
- ఒప్పుకోకపోవడంతో ఈరోజు హత్యకు యత్నం
- ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న యువతి
ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలను తమ ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. కర్నూలు పట్టణంలోని బంగారుపేట కాలనీలో ఉంటున్న బాధితురాలిపై ఈ రోజు ఉదయం శంకర్ కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. యువతిపై దాడి అనంతరం తానూ ఆత్మహత్య ప్రయత్నం చేయబోగా శంకర్ ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.