లోటస్ పాండ్ లో జగన్ కు వైద్య పరీక్షలు

  • లోటస్ పాండ్ లో విశ్రాంతి తీసుకుంటున్న జగన్
  • ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన నలుగురు డాక్టర్లు
  • శనివారం నుంచి పాదయాత్రను ప్రారంభించాలనుకుంటున్న జగన్
విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తి దాడికి గురైన వైసీపీ అధినేత ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరీక్షించారు. హైదరాబాదులోని తన నివాసం లోటస్ పాండ్ లో జగన్ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ కు సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రికి చెందిన నలుగురు వైద్యులు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు అయిన గాయాన్ని పరిశీలించారు. శనివారం నుంచి పాదయాత్రను మళ్లీ ప్రారంభించాలని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు పరీక్షించారు. జగన్ ను పరీక్షించిన వారిలో ఆయనకు సర్జరీ చేసిన డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ సాంబశివారెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ మధులు ఉన్నారు.
Go Back to Shorts
jagan
lotus pond
health
checkup
ysrcp

More Telugu News