జగన్ చనిపోతే షర్మిల, విజయమ్మ గద్దెనెక్కాలనుకుంటున్నారు: బాబు రాజేంద్రప్రసాద్

  • జగన్ కుటుంబంలో అనేక విభేదాలు ఉన్నాయి
  • జగన్ ను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది
  • జీవీఎల్ కు పిచ్చికుక్క కరిచింది
వైసీపీ అధినేత జగన్ పై దాడి గురించి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై దాడి చేయడం వల్ల టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన అన్నారు. జగన్ కుటుంబంలో అనేక విభేదాలు ఉన్నాయని చెప్పారు. జగన్ ను అణగదొక్కేందుకు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల యత్నిస్తున్నారని అన్నారు.

జగన్ చనిపోతే గద్దెనెక్కాలని విజయమ్మ, షర్మిల యత్నిస్తున్నారనే అనుమానం కలుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసు విచారణను ఈ కోణంలో కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. దాడి జరిగి నాలుగు రోజులైనా జగన్ స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కండకావరంతో మాట్లాడుతున్నారని... ఆయనకు పిచ్చికుక్క కరిచిందని ఎద్దేవా చేశారు. 
Go Back to Shorts
jagan
sharmila
vijayamma
babu rajendraprasad

More Telugu News