కాంగ్రెస్‌తో పోరాడతా.. కానీ గాంధీ కుటుంబాన్ని ఒక్క మాటా అనను!: అజిత్ జోగి
- చత్తీస్‌గఢ్‌కు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన జోగి
- వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు
- కాంగ్రెస్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్న మాజీ సీఎం
‘‘కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటకొచ్చాను. ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తా. కానీ గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనను. ఆ పార్టీ నాకు బోల్డంత ప్రేమను, అభిమానాన్ని పంచింది’’ అని జోగి స్పష్టం చేశారు. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై వచ్చిన ఆరోపణలపై స్పందించాల్సిందిగా కోరినప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ జోగి 2016లో కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.