జగన్ కోర్టుకు రాలేరన్న న్యాయవాది... అంగీకరించిన సీబీఐ న్యాయమూర్తి!

  • నేడు అక్రమాస్తుల కేసులో విచారణ
  • నిన్న జగన్ పై దాడి
  • సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స
అక్రమాస్తుల కేసులో నేడు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణను ఎదుర్కోవాల్సిన వైకాపా అధినేత వైఎస్ జగన్, నిన్న వైజాగ్ ఎయిర్ పోర్టులో దాడికి గురైన నేపథ్యంలో, నేటి విచారణకు ఆయన రాలేకపోతున్నారని కోర్టులో జగన్ న్యాయవాదులు మెమోను దాఖలు చేశారు. ప్రస్తుతం జగన్, సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని జగన్ న్యాయవాది వెల్లడించగా, ఆయన ఆరోగ్యం ఎలా ఉందని న్యాయమూర్తి అడిగినట్టు తెలుస్తోంది. ఆపై జగన్ కు నేటి విచారణ నుంచి మినహాయింపును ఇస్తున్నట్టు వెల్లడించిన జడ్జి, విచారణ కొనసాగించారు.
Go Back to Shorts
Jagan
Court
Nampalli
CBI Court

More Telugu News