సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన విష్ణు విశాల్!
- రత్ససన్ సినిమా చూసిన రజనీ
- నటన బాగుందంటూ హీరో విష్ణు విశాల్ కు ప్రశంసలు
- ట్విట్టర్ లో వివరాలు పంచుకున్న నటుడు
ఈ సినిమాలో హీరో, యువ నటుడు విష్ణు విశాల్ నటన రజనీకి తెగ నచ్చేసిందట. దీంతో వెంటనే విష్ణు విశాల్ కు ఫోన్ చేసిన రజనీ.. సినిమాలో మీ నటన అద్భుతంగా ఉందని కితాబిచ్చారట. దీంతో ఆనందంతో ఈ యువహీరో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా ట్విట్టర్ లో పంచుకున్నాడు. ‘సినిమాతో పాటు నీ నటన బాగుంది. పోలీస్ డ్రెస్ లో ఫిట్ గా ఉన్నావ్, చక్కగా నటించావు’ అని రజనీ తనకు కితాబిచ్చినట్లు విశాల్ చెప్పారు.