స్టేజ్ పై జూనియర్ ఎన్టీఆర్ అన్న ఆ ఒక్కమాట చాలు: పరుచూరి గోపాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్టేజ్ పై జూనియర్ ఎన్టీఆర్ అన్న ఆ ఒక్కమాట చాలు: పరుచూరి గోపాలకృష్ణ

  • బాలకృష్ణ గురించి తారక్ గొప్పగా మాట్లాడాడు 
  • బాలకృష్ణను చూస్తే నాకు అన్నగారు గుర్తుకొచ్చారు 
  • వాళ్ల ముగ్గురిని స్టేజ్ పై చూసి నా గుండె తడిసింది     
మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు ఫ్యామిలీతో పరుచూరి బ్రదర్స్ కి ఎంతో సాన్నిహిత్యం వుంది. అందువలన ఆ కుటుంబాన్ని గురించి సమయం దొరికినప్పుడల్లా వాళ్లు మాట్లాడుతూనే వుంటారు. అలాగే ఇటీవల జరిగిన 'అరవింద సమేత' సక్సెస్ మీట్ ను గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

"బాలయ్య .. ఎన్టీఆర్ ల అనుబంధాన్ని గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మీడియా మిత్రులకి నేను చెబుతూనే వస్తున్నాను. వాళ్లలో కొంతమంది రాసిన రాతల్లో నిజాలు లేవనేది 'అరవింద సమేత' సక్సెస్ మీట్ చూస్తే మీకు అర్థమవుతుంది. తారక్ ఎంత మంచి మాట అన్నాడో చూశారా .. 'బాబాయ్ కాదు మా నాన్న వచ్చాడు' అన్నాడు. తారక్ .. కల్యాణ్ రామ్ ల భుజాలపై చేతులు వేసి బాలయ్య అక్కున చేర్చుకున్నారు. అలా భుజాలపై చేతులు వేసిన తీరు చూసినప్పుడు నాకు అన్నగారు గుర్తుకు వచ్చారు. ఆ ముగ్గురినీ అలా వేదికపై చూసినప్పుడు, చాలామందికి కళ్లు తడిసి ఉంటాయి .. నాకు మాత్రం గుండె తడిసింది" అని చెప్పుకొచ్చారు.    
paruchuri
balakrishna
ntr

More Telugu News