వైరముత్తు అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు.. అందుకు ఏఆర్ రెహమాన్ పేరును కూడా వాడుకున్నాడు!: రెహమాన్ సోదరి రెహానా
- ఈ విషయాలు రెహమాన్ కు తెలియవు
- ఆరోపణలు రాగానే నన్ను అడిగాడు
- వైరముత్తు వ్యవహారాలన్నీ బయటపెట్టాను
వైరముత్తు వేధింపులపై గాయని చిన్మయి శ్రీపాద చేసిన ఆరోపణలను తాను నమ్ముతున్నట్లు రెహానా అన్నారు. ఈ విషయం బయటకు రాగానే ‘ఇది నిజమేనా?’ అని అడిగాడనీ, దీంతో వైరముత్తుపై వచ్చిన ఆరోపణల గురించి రెహమాన్ కు చెప్పినట్లు ఆమె తెలిపారు. మీటూ ఉద్యమానికి తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.