వయసులో పెద్దయిన యూపీ అమ్మాయిని వలేసి పట్టిన కన్నడ అబ్బాయి... కథ ఇంకా తేలలేదు!
- 23 ఏళ్ల అమ్మాయితో ఫేస్ బుక్ లో 20 ఏళ్ల అబ్బాయి ప్రేమ
- వయసు దాచి పెట్టి ప్రేమ కొనసాగింపు
- నమ్మి బెంగళూరు వచ్చిన యువతి
- అతనితోనే ఉంటానని పట్టుబట్టడంతో కౌన్సెలింగ్
తన ఇంట్లో వివాహం విషయం తెలిస్తే, ఒప్పుకోరని ఆమెను నమ్మించిన అతను, హాస్టల్ లో నెల రోజులు ఉంచి, ఆపై ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లోని వాళ్లు ఆగ్రహంతో ఇద్దరినీ గెంటేసి, ఉత్తర ప్రదేశ్ లో ఉన్న అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడారు. వారిని పిలిపించి, అమ్మాయిని తీసుకెళ్లాలని గట్టిగా చెప్పారు. అమ్మాయి తల్లిదండ్రులు సైతం ఆమెను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పుడు స్టోరీ రైల్వే స్టేషన్ కు మారింది. స్టేషన్ లో తమతో రావాలని కుమార్తెను ఆమె తల్లిదండ్రులు కొడుతూ ఉండటంతో చూసిన రైల్వే పోలీసులు రంగంలోకి దిగి, విషయం ఆరా తీశారు. యువతిని వనితా సహాయవాణి అధికారులకు అప్పగించారు. వారు అమ్మాయిని విచారించగా, తాను బెంగళూరులోనే ఉంటానని, భర్త తనకు కావాలని గట్టిగా చెప్పింది. యువకుడిని పిలిచి విచారించగా, తనకింకా ఉద్యోగం లేదని, ఉద్యోగం రాగానే కాపురం పెడతానని చెప్పాడు. ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ నిర్వహించినా, తాను కూడా బెంగళూరులోనే ఏదైనా ఉద్యోగం చూసుకుని ఉండిపోతానని పట్టుబట్టింది. దీంతో ఆమెను వనితా ఆశ్రయ సెంటర్ లోనే ఉంచారు.
వీరి లవ్ స్టోరీ ఇంకేం మలుపు తిరుగుతుందో? అబ్బాయి ఉద్యోగం సంపాదించి, అమ్మాయిని కాపురానికి ఎప్పుడు తీసుకెళతాడో?... లేక అమ్మాయి బెంగళూరులో ఉద్యోగం చూసుకుని భర్తను తన దగ్గరకే పిలుచుకుంటుందో.. ఈ రియల్ స్టోరీ ఇంకా ముగియలేదు.