Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విద్యార్థినిపై లైంగిక వేధింపులు... క్లాసు రూములోనే ఉపాధ్యాయుడికి బడితె పూజ!

  • విద్యార్థినిని లైంగికంగా వేధించిన కన్నన్
  • తీవ్ర ఆగ్రహానికి గురైన బంధువులు
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో
విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడిని క్లాస్ జరుగుతుండగానే విద్యార్థుల ఎదుటే కాళ్లతో తన్ని.. పిడిగుద్దులు కురిపించి.. చితక్కొట్టారు. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్‌లో పదో తరగతి విద్యార్థుల కోసం పాఠశాల యాజమాన్యం ప్రత్యేక తరగతులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ విద్యార్థినిపై కన్నేసిన కన్నన్ అనే ఉపాధ్యాయుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ విద్యార్థిని వారం రోజుల పాటు పాఠశాలకు వెళ్లలేదు.

ఈ విషయమై విద్యార్థినిని తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయం వెల్లడించింది. విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె బంధువులు దాదాపు 20 మంది వెళ్లి క్లాస్ రూంలో విద్యార్థుల ఎదుటే ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. పాఠశాల యాజమాన్యం వచ్చి ఉపాధ్యాయుడిని విడిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ విషయమై తిరువన్నామలై అదనపు ఎస్పీ వనిత మాట్లాడుతూ.. విద్యార్థినిపై ఉపాధ్యాయుడి వేధింపులకు సంబంధించి విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు.
10th Student
Teacher
Kannan
Tamilnadu
Vanitha

More Telugu News