శంషాబాద్ లో అమ్మవారి విగ్రహం పాలు తాగుతోందంటూ ప్రచారం
- శంషాబాద్ కోట మైసమ్మ ఆలయంలో పాలు తాగుతున్న అమ్మవారు
- ఇది అమ్మవారి మహాత్మ్యమని నమ్ముతున్న భక్తులు
- ఆలయానికి తండోపతండాలుగా చేరుకుంటున్న భక్తులు
మరోవైపు, అమ్మవారు పాలు తాగుతున్నారనే ప్రచారంతో... ఈ పరిసర ప్రాంతాల్లో పాల ప్యాకెట్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ సందర్భంగా ఓ భక్తుడు మాట్లాడుతూ, ఉదయం అమ్మవారికి హోమం చేశామని తెలిపారు. విగ్రహాలు పాలు తాగుతాయని గతంలో విన్నామని... అమ్మవారికి కూడా పాలు తాగించాలని ఆవు పాలను తెప్పించి, స్పూన్ తో తాగించామని చెప్పారు. ఆశ్చర్యకరంగా అమ్మవారు పాలను తాగారని తెలిపారు.