వీవీఐపీలను మించిన బందోబస్తు మధ్య... చరిత్ర సృష్టించేందుకు శబరిమల కొండ ఎక్కుతున్న ఇద్దరు యువతులు!
- నడక ప్రారంభించిన ఇద్దరు యువతులు
- కొచ్చికి చెందిన కవిత, హైదరాబాద్ మోజో టీవీ జర్నలిస్టు
- భద్రతా ఏర్పాట్లు స్వయంగా చూస్తున్న ఐజీ
- అడుగడుగునా నిరసనల మధ్య నడక
ఈ ఉదయం కొచ్చికి చెందిన కవిత అనే మహిళతో పాటు, హైదరాబాద్ మోజో టీవీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు భారీ భద్రత మధ్య సన్నిధానానికి నడక ప్రారంభించారు. ఒకవేళ వీరిద్దరూ ఆలయం వరకూ చేరుకుని, 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటే చరిత్ర సృష్టించినట్టే. వీరికి భద్రత కల్పించి, ఆలయం వద్దకు చేర్చే బాధ్యతలను సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఐజీ శ్రీజిత్ చేపట్టారు. వీరిని అడ్డుకునేందుకు అయ్యప్ప భక్తులు అడుగడుగునా ప్రయత్నిస్తున్నారని, పోలీసులు వారిని ఎక్కడికక్కడ చెదరగొడుతూ, ఇద్దరినీ 4.6 కిలోమీటర్లున్న నడక మార్గంలో తీసుకెళుతున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.