రాజకీయ అరంగేట్రం చేసిన షమీ భార్య జహాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజకీయ అరంగేట్రం చేసిన షమీ భార్య జహాన్

  • కాంగ్రెస్ పార్టీలో చేరిన జహాన్
  • ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ సమక్షంలో పార్టీలో చేరిక
  • బాలీవుడ్ లో అవకాశాల కోసం యత్నిస్తున్న జహాన్
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముంబై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వృత్తి రీత్యా జహాన్ మోడల్ అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకునే పనిలో ఆమె ప్రస్తుతం ఉన్నారు.

మరోవైపు, షమీతో జహాన్ కు విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. షమీతో పాటు అతని కుటుంబసభ్యులు తనను శారీరకంగా హింసించారని, అసభ్యంగా ప్రవర్తించారని ఆమె పోలీసు కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో షమీ బీసీసీఐ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు షమీని బీసీసీఐ మళ్లీ తీసుకుంది. 
hasin jahaan
mohammed shami
team india
congress

More Telugu News