ప్రశాంత్ కిషోర్ కు నెంబర్-2 స్థానాన్ని అప్పగించిన నితీశ్ కుమార్!
- గత నెలలో జేడీయూలో చేరిన ప్రశాంత్ కిషోర్
- పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించిన నితీష్ కుమార్
- ప్రశాంత్ కిషోర్ నియామకం పార్టీ భవిష్యత్తును మార్చబోతోందన్న కేసీ త్యాగి
ఈ సందర్భంగా జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి మాట్లాడుతూ, ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్ నియామకం పార్టీ భవిష్యత్తును మార్చబోతోందని చెప్పారు. ఇప్పటిదాకా తమ సపోర్ట్ బేస్ సంప్రదాయబద్ధంగానే ఉందని... ఇకపై పలు కోణాల్లో ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లబోతున్నామని తెలిపారు.