మాకు పిల్లలు లేరు.. తెలంగాణ ప్రజలే మా కుటుంబం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- మిగ్-21, మిగ్-23 యుద్ధ విమానాల పైలట్ గా పని చేశా
- చిన్న వయసులోనే రాష్ట్రపతి కార్యాలయంలో బాధ్యతలు నిర్వహించా
- ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన లేదు
భారత రాష్ట్రపతి కార్యాలయంలో చిన్న వయసులోనే కీలక బాధ్యతలను నిర్వహించే అవకాశం తనకు రావడం ఒక అదృష్టమని ఉత్తమ్ చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే కోరికతోనే... ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తాను, తన భార్య పద్మావతి ఇద్దరం ఎమ్మెల్యేలుగానే ఉన్నామని.. తమకు పిల్లలు లేరని, రాష్ట్ర ప్రజలే తమ కుటుంబమని అన్నారు. ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన తనకు లేదని... తమ అధినేత రాహుల్ గాంధీ ఎవర్ని సీఎం చేసినా, తాను అంగీకరిస్తానని చెప్పారు.