Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన ప్రేమకు అడ్డొస్తున్నాడని.. తమ్ముడినే హత్య చేసింది

  • రేణు ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన అన్ష్
  • తమ్ముడి గొంతు నులిమి హత్య
  • మృతదేహాన్ని బ్యాగులో వేసింది
ఇటీవలి కాలంలో పరువు హత్య, ప్రేమ పేరుతో హత్య, ప్రేమ కోసం హత్యలు నిత్యకృత్యమైపోయాయి. తన ప్రేమ వ్యవహారానికి అడ్డొస్తున్నాడని ఓ యువతి తన తోడబుట్టిన తమ్ముడినే హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లుధియానాకు చెందిన రేణు కనౌజియా (19) ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తమ్ముడు అన్ష్‌ కనౌజియా.. తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో రేణుపై ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తమ్ముడిపై కక్ష పెంచుకున్న రేణు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అన్ష్ గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని బ్యాగులో వేసిందని.. ఆ బాలుడి ఒంటిపై దుస్తులు కూడా లేవని పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణలో రేణు తమ్ముడిని హత్య చేయడంలో తప్పేలేదంటూ మాట్లాడిందని తెలుస్తోంది. మొదట ఓ బ్యాగులో తన తమ్ముడి మృతదేహాన్ని ఉంచి, ఇంట్లో గోధుమ బస్తాల మధ్య దాచిందని పోలీసులు తెలిపారు. తన తల్లిదండ్రులు ఇంటికి రాగానే తమ్ముడు కనిపించట్లేదని చెప్పిందని, అనంతరం ఆమె.. తన తమ్ముడి మృతదేహాన్ని దాచిన బ్యాగుని ఇంటి ముందు విసిరేసిందని పోలీసులు వెల్లడించారు.
Renu Kanousia
Ansh
Police
Lutheana
Murder

More Telugu News