పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్యకు తీవ్ర అస్వస్థత
- కేర్ ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
- రామయ్య సతీమణి జానకమ్మకు కూడా జ్వరం
- ఒకే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు
ఖమ్మం రూరల్ మండం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దారిపల్లి రామయ్యకు మొక్కలంటే ప్రాణం. భూమి పచ్చదనంతో అలరారాలని కోరుకుంటూ మొక్కలు నాటడాన్ని ఓ ఉద్యమంలా చేపట్టారు. దాదాపు కోటి మొక్కలు నాటించారు. అందుకే ఈయనను స్థానికులు చెట్ల రామయ్య, వనజీవి రామయ్య అని పిలుస్తుంటారు. ఈయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారాన్నిఅందించి సత్కరించింది. 1937లో పుట్టిన రామయ్య వయసు ప్రస్తుతం 81 ఏళ్లు.