ఎన్టీఆర్ రావడంతోనే సెట్ లో పరిస్థితి మారిపోయేది: త్రివిక్రమ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ రావడంతోనే సెట్ లో పరిస్థితి మారిపోయేది: త్రివిక్రమ్

  • ఎన్టీఆర్ ఎంతో ఉత్సాహంగా వుంటారు 
  • అందరూ హుషారుగా పనిచేసేవారు 
  • అనుకున్న సమయానికి పూర్తి చేశాము  
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అరవింద సమేత వీర రాఘవ'ను .. ఈ నెల 11వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు.

"మరుసటి రోజు షూటింగ్ వుంటే 'మేకప్ తో అయితే ఎన్ని గంటలకి రావాలి? మేకప్ లేకుండా అయితే ఎంత ముందుగా రావాలి?' అని ఎన్టీఆర్ అడిగేవారు. ఒక స్టార్ హీరో అలా అడగడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది. ఎన్టీఆర్ సెట్లో అడుగుపెట్టగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయేది. ఆయనలోని ఉత్సాహం కారణంగా .. సెట్ లోని వాళ్లంతా మరింత హుషారుగా పనిచేసేవాళ్లు. ఆయన సెట్లో వున్నంత వరకూ ఎవరిలోనూ నిరుత్సాహం .. అలసత్వం కనిపించేది కాదు. ఆయన స్పీడ్ ను అందుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించడం వలన, అనుకున్న సమయానికి షూటింగు పూర్తయింది" అని చెప్పుకొచ్చారు.  
trivikram
ntr

More Telugu News