మావోయిస్టు డిప్యూటీ కమాండర్‌ ముడా అరెస్టు

  • మీడియా ఎదుట ప్రవేశపెట్టిన తూర్పు గోదావరి ఎస్పీ విశాల్ గున్నీ
  • మావోయిస్టు గ్రూప్‌ కమాండర్‌ ఇడుమాకు, ముడా ప్రధాన అనుచరుడు
  • తూర్పు మన్యంలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను పట్టపగలు కాల్చి చంపడం ద్వారా పోలీసులకు సవాల్‌ విసిరిన మావోయిస్టులు ఏఓబీలో మళ్లీ పట్టు సాధిస్తున్నారని అనుకుంటున్న సమయంలో ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చత్తిస్‌గడ్‌, ఆంధ్రా సరిహద్దులో ఇడుమా బెటాలియన్‌ డిప్యూటీ కమాండర్‌ పోడియం ముడాను పోలీసులు అరెస్టు చేసి పైచేయి సాధించారు.

2014లో చత్తీస్‌గడ్‌లో ఆ రాష్ట్ర మంత్రి మహేందర్‌ కర్మ సహా 198 మంది పోలీసుల మృతికి కారణమైన ఘటనలో పాల్గొన్న మావోయిస్టు గ్రూప్‌ కమాండర్‌ ఇడుమాకు, ముడా ప్రధాన అనుచరుడు.  సోమవారం ముడాను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన తూర్పు గోదావరి ఎస్పీ విశాల్ గున్నీ, ముడా నుంచి 20 డిటోనేటర్లు, 20 జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Go Back to Shorts
Maoists
dy.group comander arrest

More Telugu News