మహారాష్ట్రలో దారుణం.. మాంజా మెడకు చుట్టుకుని మహిళా డాక్టర్ మృతి

  • ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఘటన
  • దారం చుట్టుకుని కోసుకుపోయిన మెడ
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. గాలి పటాలకు కట్టే మాంజా మెడకు చుట్టుకుని ఓ మహిళా వైద్యురాలు మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. భోసరీ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 26 ఏళ్ల వైద్యురాలు డాక్టర్ కరుపలీ నికమ్ మెడకు మాంజా చుట్టుకుంది. అది మెడకు బలంగా బిగుసుకోవడంతో ఆమె వాహనం నుంచి కింద పడ్డారు. మాంజా కోసుకుపోవడంతో ఆమె మెడ నుంచి తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Manja
Kite
Maharashtra
Doctor
Dead

More Telugu News