అవును, ఈ బచ్చాగాళ్లే తెలంగాణ తెచ్చారు.. నువ్వేమో కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకున్నావ్!: ఉత్తమ్ పై మంత్రి కేటీఆర్ ఫైర్
- కాంగ్రెస్ నేతలకు బలుపు ఎక్కువ
- ఉద్యమం సమయంలో ఇళ్లలో దాక్కున్నారు
- 100కు పైగా సీట్లలో విజయం సాధిస్తామని ధీమా
తాను గట్టిగా మాట్లాడితే బచ్చా అని అంటున్నారనీ, కాంగ్రెస్ దద్దమ్మలు ఇంట్లో దాక్కుంటే ఈ బచ్చాగాళ్లే ప్రత్యేక తెలంగాణను తెచ్చారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు సైనికుడే కాదనీ, ఆయన ఓ బంట్రోతు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యార్థులంతా కాంగ్రెస్ పార్టీ కి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాహుల్ గాంధీ కుటుంబానికి, తెలంగాణ ప్రజల పౌరుషానికి మధ్యే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. ప్రగతి భవన్ కోట గడులు పగులగొడతామన్న కోదండరాం.. ఇప్పుడు గోడలు గీస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈసారి ఎన్నికల్లో 100కు పైగా ఎమ్మెల్యే సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.