ఫోన్‌లో మాట్లాడుతోందని కన్న కూతురిని కత్తితో పొడిచిన తండ్రి.. చావుబతుకుల మధ్య బాలిక!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫోన్‌లో మాట్లాడుతోందని కన్న కూతురిని కత్తితో పొడిచిన తండ్రి.. చావుబతుకుల మధ్య బాలిక!

  • కుమార్తెపై అనుమానంతో దాడి
  • వెంటాడి మరీ నరికిన వైనం
  • రక్తపు మడుగులో కుప్పకూలిన బాలిక
కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. కుమార్తె ఫోన్‌లో మాట్లాడుతోందని కన్న తండ్రే ఆమెపై కత్తి దూశాడు. పారిపోతుంటే వెంటాడి మరీ నరికాడు. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక అంబేద్కర్‌నగర్‌లో నివసిస్తున్న జాంగిరి అలియాస్ ఆటో జానీ-రంగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆటో నడిపి కుటుంబాన్ని పోషించే జాంగిరిపై రౌడీ షీట్ కూడా ఉంది.

కుమార్తె అంజలి (16)ని నిత్యం అనుమానించేవాడు. ఎవరితో మాట్లాడినా దూషించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం అంజలి ఫోన్‌లో మాట్లాడుతుండగా చూసిన జాంగిరి రెచ్చిపోయాడు. తిడుతూ కర్రతో దాడి చేశాడు. తండ్రి దెబ్బలకు తాళలేని అంజలి పక్క వీధిలో ఉంటున్న నాయనమ్మ వెంకటమ్మ ఇంటికి పరుగులు తీసింది. ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో పక్కనే ఉన్న మేనమామ దుర్గ ఇంటికి వెళ్లింది.

దీంతో కత్తి తీసుకుని కుమార్తెను వెంటాడుతూ వచ్చిన జాంగిరి.. దుర్గ ఇంటి వద్ద ఆమెను పట్టకుని ఆరుసార్లు పొడిచాడు. రక్తపు మడుగులో బాలిక కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను దుర్గ స్థానిక ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Kurnool District
Adoni
Cellphone
Girl
attack

More Telugu News