ఫ్రెండ్స్ తో పందెంకట్టి న్యూడ్ గా డబ్ స్మాష్ వీడియో చేసిన యువతి... ఆపై ఫోన్ పోగొట్టుకుంటే జరిగిన నష్టమిది!
- రూ. 10 వేలు పందం కట్టి న్యూడ్ వీడియో
- ఫోన్ దొరికిన యువకుడి బెదిరింపులు
- ఆట కట్టించిన షీ టీమ్స్
- పెడ ధోరణులు వద్దని యువతికి క్లాస్ పీకిన పోలీసులు
ఆమె సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఒకరోజు బయటకు వెళ్లిన వేళ, ఆమె తన సెల్ ఫోన్ పోగొట్టుకుంది. ఆపై రెండు రోజుల తరువాత, ఓ యువకుడు ఫోన్ చేసి, "నీ న్యూడ్ వీడియోలు నాదగ్గర ఉన్నాయి. రూ. 2 లక్షలు ఇవ్వకుంటే వాటిని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తా" అని బెదిరింపులకు దిగాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని యువతి షీ టీమ్స్ ను ఆశ్రయించి, తన గోడును వెళ్లబోసుకుంది. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు, ఆ యువకుడిని గుర్తించి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఆ అమ్మాయిని హెచ్చరించి పంపారు.
కొంతమంది అమ్మాయిలు స్నానం చేస్తూ వీడియోలు తీసుకుంటున్నారని, వాటిని స్నేహితురాళ్లతో పంచుకుంటున్నారని,ఈ తరహా ఘటనలు ఏ మాత్రం కూడదని పోలీసులు సలహా ఇస్తున్నారు.