చంద్రబాబును గద్దెదించాలన్నది పవన్ కుట్ర: నటుడు శివాజీ ఆరోపణ

  • అభివృద్ధిని అడ్డుకుంటున్న కొందరు నేతలు
  • రాజకీయాల స్థానంలో కుతంత్రాలు వచ్చి చేరాయి
  • తిరుమలలో నటుడు శివాజీ
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడిని ఎలాగైనా గద్దె దించాలని కుట్ర జరుగుతోందని, దానిలో పవన్ కల్యాణ్ భాగస్వామిగా మారారని నటుడు శివాజీ విమర్శలు చేశారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చిన ఆయన, వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఏపీకి ప్రత్యేక హోదా రావాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పిన శివాజీ, ఏపీ అభివృద్ధిని కొంతమంది నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రస్తుతం నడుస్తున్నది రాజకీయాలు కాదని, కుతంత్రాలని అభిప్రాయపడ్డ ఆయన, ప్రజలు అభివృద్ధి వెంటే ఉంటారన్న నిజం ఎన్నికల తరువాత నిరూపితం అవుతుందని అన్నారు.
Go Back to Shorts
Tirumala
Sivaji
Andhra Pradesh
Chandrababu
Pawan Kalyan

More Telugu News