దేశంలో తొలిసారి సరికొత్త బిల్లును తీసుకొచ్చిన కర్ణాటక.. రాష్ట్రపతి ఆమోదం!
- రోడ్డు ప్రమాద ఘటనల్లో బాధితులను ఆదుకునేలా ప్రోత్సహిస్తున్న చట్టం
- బాధితులను ఆదుకుంటే ఇక కేసులుండవు
- రెండేళ్ల క్రితమే రాష్ట్రపతికి పంపిన ప్రభుత్వం
కర్ణాటక జీవరక్షక, వైద్య సాయం (అత్యవసర సందర్భాల్లో రక్షణ) నియంత్రణ బిల్లు-2016గా వ్యవహరించే ఈ బిల్లును రెండేళ్ల క్రితమే అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపారు. ఇప్పుడీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించినట్టు రవాణా శాఖ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ తెలిపారు. ఈ చట్టం ప్రకారం రోడ్డు ప్రమాదాలు, ఘర్షణల్లో కత్తిపోట్లు వంటి వాటితో గాయపడిన బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లిన వారిపై ఎటువంటి కేసులు ఉండవు. బాధితులను రక్షించిన వారిని విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేయరు.