విజయ్ దేవరకొండ కోసం కథ రెడీ చేయనున్న కొరటాల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్ దేవరకొండ కోసం కథ రెడీ చేయనున్న కొరటాల

  • విభిన్నమైన కథలను చేస్తోన్న విజయ్
  •  'పెళ్లి చూపులు' నుంచి ఆయనపై దృష్టి 
  • త్వరలో మంచి కథతో కలుస్తాను  
యూత్ లో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'నోటా' రెడీ అవుతోంది. ఈ నెల 5వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్'ను పూర్తి చేసే పనిలో పడనున్నాడు. ఈ సినిమా కాకుండా ఆల్రెడీ ఆయన చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు వున్నాయి.

విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి కొంతమంది దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఆ జాబితాలో కొరటాల శివ ఉన్నాడనే విషయం నిన్న 'నోటా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. 'పెళ్లి చూపులు' సినిమా వచ్చినప్పటి నుంచి విజయ్ దేవరకొండ కోసం కథను రెడీ చేయాలనుకుంటున్నాను. కానీ ఆయన విభిన్నమైన కథా చిత్రాలను చేస్తూ ఏ తరహా కథను సిద్ధం చేయాలనే విషయంలో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అన్నారు. మంచి స్క్రిప్ట్ తో త్వరలోనే విజయ్ దేవరకొండను కలుస్తాను' అని  చెప్పారు. దాంతో చిరంజీవి ప్రాజెక్టు తరువాత కొరటాల చేయనున్న సినిమా విజయ్ దేవరకొండతోనేనని అంతా అనుకుంటున్నారు.
koratala
vijay devarakonda

More Telugu News