హీరోగా కౌశల్ .. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోగా కౌశల్ .. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు?

  • 'బిగ్ బాస్ 2' విన్నర్ గా కౌశల్
  • అందరిలోను పెరిగిన క్రేజ్ 
  • హీరోగా ఎంట్రీకి సన్నాహాలు
సినిమా నిర్మాణం విషయంలో తెలుగులో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. కథ నచ్చిన కొంతమంది వ్యక్తులు కలిసి నిర్మాతలుగా మారుతున్నారు. లాభాలు వస్తే అంతా పంచుకుంటారు .. సినిమా ఆడకపోతే ఒక్కొక్కరిపై పడే నష్టం ప్రభావం తక్కువ. ఇటీవల 'మను' సినిమా కూడా అలాగే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రీసెంట్ గా 'బిగ్ బాస్ 2'లో కౌశల్ ను గెలిపించిన కౌశల్ ఆర్మీ .. ఆయన కోసం నిర్మాతలుగా మారుతున్నారు. అంతా కలిసి 4 కోట్ల రూపాయలను పోగేసి ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో సినిమాల్లోను .. సీరియల్స్ లోను .. యాడ్స్ లోను నటించిన అనుభవం కౌశల్ కి వుంది. ఆయన సోలో హీరోగా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.      
kaushal

More Telugu News