మోదీకి దత్తపుత్రుడు పవన్.. అవినీతి పుత్రుడు జగన్: లోకేష్
- జగన్, పవన్ లకు ఓటు వేస్తే.. బీజేపీకి వేసినట్టే
- వైసీపీ ఒక డ్రామా కంపెనీ
- ప్రత్యేక హోదా ఎవరిస్తే వారే ప్రధాని అవుతారు
ప్రధాని మోదీకి దత్తపుత్రుడు పవన్ అయితే, అవినీతి పుత్రుడు జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఒక డ్రామా కంపెనీ అంటూ దుయ్యబట్టారు. జగన్, పవన్ లకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఎవరిస్తే వారే ప్రధాని అవుతారని తెలిపారు. రూ. 24 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని చెప్పారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ధర్మ పోరాట దీక్ష సభలో ప్రసంగిస్తూ లోకేష్ ఈమేరకు విమర్శలు గుప్పించారు.