చంద్రబాబు నిప్పు.. అందుకే ఒక్క కేసునూ రుజువు చేయలేకపోయారు!: కొల్లు రవీంద్ర
- చంద్రబాబుపై ప్రతిపక్షాల అసత్య ఆరోపణలు
- వైసీపీతో రాష్ట్రం పరువు పోతోంది
- గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా నిరుద్యోగుల కోసం 'ముఖ్యమంత్రి యువనేస్తం' పథకాన్ని ప్రారంభించామని రవీంద్ర తెలిపారు. దీనికింద ఇప్పటివరకూ 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. మంత్రి నారా లోకేశ్ గతంలో విసిరిన చాలా సవాళ్లకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించలేదని రవీంద్ర పేర్కొన్నారు.