అన్నాడీఎంకే ఆహ్వానపత్రికలో స్టాలిన్, కనిమొళి పేర్లు!

25-09-2018 Tue 12:09 | National
  • ఈనెల 30న ఎంజీఆర్ శతజయంతి ముగింపు వేడుకలు
  • అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామన్న అన్నాడీఎంకే
  • సభలో ప్రసంగించాలనే వారి పేర్లను ముద్రించాం
తమిళనాడు రాజకీయాల్లో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఈనెల 30న అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ శతజయంతి ముగింపు వేడుకలను ఆ పార్టీ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఆహ్వానపత్రికలో డీఎంకే అధినేత స్టాలిన్, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పేర్లను ముద్రించారు. ఇది తమిళనాట సంచలనం రేకెత్తిస్తోంది.

ఈ అంశంపై మంత్రి, అన్నాడీఎంకే నేత పాండియరాజన్ మాట్లాడుతూ, ఎంజీఆర్ శతజయంతి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని... ఈ కారణంగానే వేడుకలకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే అధినేత స్టాలిన్ ను, ఆ పార్టీ ఎంపీ కనిమొళిని ఆహ్వానించామని చెప్పారు. సభలో వారు ప్రసంగించాలనే సదుద్దేశంతోనే వక్తల జాబితాలో వారి పేర్లను ముద్రించామని తెలిపారు. అదే విధంగా దినకరన్ కూడా ప్రసంగించాలనే ఆయన పేరును కూడా ముద్రించామని చెప్పారు. అయితే, ఈ వేడుకల్లో పాల్గొనాలా? వద్దా? అనే నిర్ణయాన్ని మాత్రం వారి అభీష్టానికే వదిలేస్తున్నామని తెలిపారు. 
aiadmkdmkmgrstalinkanimozhittv dinakaranpandiarajan

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more