అమ్మ చెప్పినట్టుగా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు: కమెడియన్ పృథ్వీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మ చెప్పినట్టుగా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు: కమెడియన్ పృథ్వీ

  • నేను నటుడిని అవుతానని అమ్మ అనేది
  • అదంతా జరిగే పని కాదులే అనేవాడిని
  • ఆ తరువాత సీరియస్ గా ట్రై చేశాను
చిన్న చిన్న పాత్రలతో తన కెరియర్ ను ప్రారంభించిన పృథ్వీ, ఆ తరువాత తనని దృష్టిలో పెట్టుకుని రచయితలు విభిన్నమైన పాత్రలను సృష్టించే స్థాయికి చేరుకున్నాడు. అలా విలక్షమైన పాత్రలను చేస్తూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "మా అబ్బాయి మంచి నటుడు అవుతాడు అని మా అమ్మ అందరితో చెబుతూ ఉండేది. 'ఒరేయ్ నువ్ సినిమాల్లోకి వెళితే కార్లో నువ్ ముందు సీట్లో .. నీ పక్కనే సీట్లో నేను' అంటూ ఉండేది.

నేను సినిమాల్లోకి వెళ్లడమేంటి .. ఆమె ఏదో సరదాకి అంటుందని అనుకునేవాడిని. 'ఇవన్నీ జరిగే పనులు కాదులే అమ్మా' అనేవాడిని. కానీ అమ్మ మాటలే నిజమవుతాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ తరువాత కాలేజ్ రోజుల్లో నటుడు .. నిర్మాత ప్రభాకర్ రెడ్డి గారిని కలిసే అవకాశం కలిగింది. సినిమాల్లో ట్రై చేయమని ఆయన అన్నారు. అప్పటి నుంచే ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ప్రయత్నం చేస్తూ వచ్చాను. చాలా కష్టాలు పడినప్పటికీ .. నేను ఎదురుచూసినట్టుగానే మంచి రోజులు వచ్చాయి" అని చెప్పుకొచ్చారు.     
pruthvi

More Telugu News