19 స్థానాల్లో టీడీపీ పోటీ... అభ్యర్థుల జాబితా ఇదే!
Add ap7am to your home Screen

19 స్థానాల్లో టీడీపీ పోటీ... అభ్యర్థుల జాబితా ఇదే!

  • 19 మంది పేర్లతో టీటీడీపీ జాబితా
  • క్యాడర్ బలంగా ఉన్న స్థానాల్లో టీడీపీ పోటీ
  • మహాకూటమిలో కొలిక్కి వస్తున్న సీట్ల సర్దుబాటు
తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో, మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశం క్రమంగా ఒక కొలిక్కి వస్తోంది. తాము పోటీ చేయాలనుకుంటున్న 19 నియోజకవర్గాల్లో అభ్యర్థుల వివరాలను కాంగ్రెస్ పార్టీకి టీడీపీ సమర్పించినట్టు సమాచారం. ఎక్కడైతే క్యాడర్ బలంగా ఉందని భావిస్తోందో... ఆ నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ పోటీ చేయనుంది. తమ అభ్యర్థుల జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అందజేసినట్టు తెలుస్తోంది.

టీడీపీ అభ్యర్థుల వివరాలు ఇవే:
  • కోరుట్ల - ఎల్. రమణ (టీటీడీపీ అధ్యక్షుడు)
  • కూకట్ పల్లి - శ్రీనివాసరావు (జీహెచ్ఎంసీ టీడీపీ ఏకైక కార్పొరేటర్)
  • సికింద్రాబాద్ - కూన వెంకటేష్ గౌడ్
  • ఉప్పల్ - వీరేందర్ గౌడ్
  • ఖైరతాబాద్ - బీఎన్ రెడ్డి (టీఎన్టీయూసీ అధ్యక్షుడు)
  • మక్తల్ - కొత్తకోట దయాకర్ (మాజీ ఎమ్మెల్యే, ఎంపీ)
  • రాజేంద్రనగర్ - ఎం. భూపాల్ రెడ్డి
  • శేరిలింగంపల్లి - మండవ వెంకటేశ్వర రావు లేదా మొవ్వా సత్యనారాయణ
  • కంటోన్మెంట్ - ఎంఎన్ శ్రీనివాసరావు (గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు)
  • ఆర్మూర్ - ఆలేటి అన్నపూర్ణ (మాజీ ఎమ్మెల్యే)
  • హుజూరాబాద్ - ఇనగాల పెద్దిరెడ్డి (మాజీ మంత్రి)
  • ఆలేరు - శోభారాణి (టీటీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు)
  • కోదాడ - బొల్లం మల్లయ్య యాదవ్
  • పరకాల / వరంగల్ వెస్ట్ - రేవూరి ప్రకాశ్ రెడ్డి
  • మిర్యాలగూడ - శ్రీనివాస్ (వ్యాపారవేత్త)
  • ఖమ్మం - నామా నాగేశ్వరరావు
  • సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య
  • దేవరకద్ర - రావుల చంద్రశేఖర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే, ఎంపీ)
  • మహబూబ్ నగర్ - చంద్రశేఖర్
tTelugudesam
candidates
l ramana
Uttam Kumar Reddy
congress
maha kutami

More Telugu News