కొజ్జా అనే పదం తప్పైతే పోలీసుల కాళ్లు పట్టుకుంటా: జేసీ దివాకర్ రెడ్డి

  • పలానావాడు కొజ్జా అని ఎవరి పేరును ఉచ్చరించలేదు
  • సీఐ మాధవ్ నా చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేశాడో ఆయనకే తెలుసు
  • ఆడ, మగ కాని వాళ్లకు కూడా మీసాలు ఉంటాయి
ప్రబోధానంద స్వామి ఆశ్రమం వివాదం కాస్తా అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి వర్సెస్ పోలీసులుగా మారిపోయింది. తమను కించపరిస్తే నాలుక కోస్తామంటూ సీఐ మాధవ్ చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ... పలనావాడు కొజ్జా అంటూ తాను ఏ ఒక్కరి పేరును ఉచ్చరించలేదని చెప్పారు. అయినా... 'కొజ్జా' అనే పదంలో తప్పేముందని ఆయన మీడియాను ప్రశ్నించారు. కొజ్జా అనే పదం తప్పైతే క్షమాపణ చెప్పడానికైనా... పోలీసుల కాళ్లు పట్టుకొని పాదాభివందనం చేసేందుకైనా సిద్ధమని చెప్పారు.

ప్రబోధానంద స్వామి ఆశ్రమం వద్ద అల్లర్లు జరుగుతుంటే... అంత మంది పోలీసులుండి, అయుధాలు ఉండి కూడా ఏమీ చేయలేకపోయారని జేసీ విమర్శించారు. మాధవ్ తన చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేశాడో ఆయనకే బాగా తెలుసని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ మీసాలు తిప్పాడని.... ఆడ, మగ కాని వాళ్లకు కూడా మీసాలు ఉంటాయని ఎద్దేవా చేశారు. మాధవ్ పై ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
Go Back to Shorts
ja diwakar reddy
ci
madhav
tadipatri

More Telugu News