ధోనీ ఈ ఆగ్రహం చూశావా?... డక్కౌట్ కావడంతో ఊగిపోయిన చిన్నారి వీరాభిమాని... వైరల్ అవుతున్న వీడియో!
- ఒక్క పరుగు కూడా చేయకుండానే నిష్క్రమించిన ధోనీ
- పట్టలేని ఆగ్రహంతో ఊగిపోయిన చిన్నారి
- నవ్వు తెప్పిస్తున్న బాలుడి అసహనం
శిఖర్ ధావన్ పెవీలియన్ దారిపట్టిన తరువాత బరిలోకి దిగిన ధోనీ, కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే అవుట్ అయ్యారు. హాంకాంగ్ స్పిన్నర్ ఇషాన్ ఖాన్ బౌలింగ్ లో ధోనీ నిష్క్రమించగా, ఆ బాలుడికి ఎంత ఆగ్రహం వచ్చిందంటే, కుర్చీలను కూడా తన్నాడు. అరుస్తూ గంతులేశాడు. ధావన్ బాదుతున్నప్పుడెల్లా ఆనందంతో గంతులేస్తూ, కనిపించిన ఆ బాలుడు, ధోనీ అవుట్ అయిన తరువాత ఏం చేశాడో మీరూ చూడండి.