చాలా రోజుల తరువాత అందమైన అమ్మాయితో రొమాన్స్: 'దేవదాస్' సినిమా గురించి నాగార్జున
- ప్రస్తుతం 'దేవదాస్'లో నటిస్తున్న నాగ్
- నాగ్ సరసన తొలిసారిగా నటిస్తున్న ఆకాంక్ష సింగ్
- ట్విట్టర్ ద్వారా పరిచయం చేసిన నాగార్జున
సినిమాలో ఆకాంక్ష 'జాహ్నవి' పాత్రలో నటిస్తుండగా, ఆమెను పరిచయం చేస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టర్ ను విడుదల చేసిన నాగ్, "చాలా రోజులు తరవాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి!! యా... రొమాన్స్ ఎగైన్" అని వ్యాఖ్యానించారు. ఈ సినిమా పాట లిరికల్ వీడియోను నేటి సాయంత్రం విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇక తెరపై హీరోయిన్లతో రొమాన్స్ ను పండించే నాగ్, ఆకాంక్షతో చేసే రొమాంటిక్ సన్నివేశాల గురించి తెలియాలంటే, ఈ నెల 27 వరకూ వేచి చూడక తప్పదు.