నేడు ప్రధాని మోదీ జన్మదినం.. ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారంటే..!
- వారణాసిలో చిన్నారుల నడుమ వేడుకలు
- బర్త్ డే విషెస్‌తో హోరెత్తుతున్న సోషల్ మీడియా
- వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
తన నియోజకవర్గమైన వారణాసిలో చిన్నారుల నడుమ ఆయన తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఈ మధ్యాహ్నం వారణాసి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా నారూర్ గ్రామానికి వెళ్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించనున్నారు. తన జీవిత విశేషాలతో రూపొందించిన సినిమాను వీక్షించనున్నారు. అనంతరం చిన్నారులతో కలిసి బర్త్ డేను జరుపుకోనున్నట్టు ప్రధాని కార్యాలయం తెలిపింది.
అనంతరం డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ క్యాంపస్‌లో ఉన్న కాశీ విద్యాపీఠ్ యూనివర్సిటీని మోదీ సందర్శిస్తారు. అక్కడ తన స్ఫూర్తితో రూపొందించిన ‘చలో జీతే హై’ అనే సినిమాను పిల్లలతో కలిసి వీక్షించనున్నారు. మంగళవారం వివిధ ప్రాజెక్టులను ప్రారంభించడమే కాకుండా రూ.500 కోట్ల నిధులతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.