uma: టీఆర్ఎస్ లో చేరిన సినీ, బుల్లితెర నటి ఉమా దేవి!

పలు టీవీ సీరియళ్లు, సినిమాల్లో నటించిన నటి ఉమాదేవి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. కూకట్ పల్లిలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉమాదేవికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు కృష్ణారావు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ, కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను చూసి, అనేక మంది పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఉమాదేవిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఉమాదేవి మాట్లాడుతూ, టీఆర్ఎస్ బలోపేతానికి, కృష్ణారావు విజయానికి కృషి చేస్తానని అన్నారు. 
uma
uma devi
TRS
madhavaram krishna rao

More Telugu News