హరికృష్ణ పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతోన్న కల్యాణ్ రామ్
- షూటింగు దశలో 'ఎన్టీఆర్'
- ముఖ్య పాత్రలో రానా
- సంక్రాంతికి విడుదల
ఎల్లుండి నుంచి ఈ సినిమా షూటింగులో కల్యాణ్ రామ్ జాయిన్ కానున్నాడు. ఈ సినిమాలో హరికృష్ణ పాత్రను కల్యాణ్ రామ్ చేయనున్నాడనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఎన్టీ రామారావు రాజకీయ ప్రస్థానంలో హరికృష్ణ ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆ పాత్ర కోసమే కల్యాణ్ రామ్ ను ఎంపిక చేసుకున్నారు. ఎల్లుండి నుంచి బాలకృష్ణ .. కల్యాణ్ రామ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్ 25 రోజుల కాల్షీట్స్ ఇచ్చాడట. ఎన్నో ప్రత్యేకతలు .. మరెన్నో విశేషాలు కలిగిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.