భార్య కాళ్లకు బురద అంటకూడదని.. భుజాలపై మోసుకెళ్లిన భూటాన్ మాజీ ప్రధాని!
- ట్విట్టర్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఫొటో
- తానేమీ సర్ వాల్టర్ రెలీనీ కాదన్న మాజీ ప్రధాని
- కామెంట్లతో హోరెత్తుతున్న ట్విట్టర్
ఈ ఫొటోను పోస్టు చేసిన ఆయన.. భార్య కోసం ఏమైతే చేయగలమో అది చేయాలని పేర్కొన్నారు. తానేమీ సర్ వాల్టర్ రెలీ అంత గొప్పోడిని కాదని పేర్కొన్నారు. క్వీన్ ఎలిజబెత్ 1 పాదాలకు బురద అంటకుండా వాల్టర్ రెలీ తన క్లోక్ (దుస్తులు)ను ఓ బురద గుంటపై పరిచి నడిపించారు. భూటాన్ మాజీ ప్రధాని తాజా ఫొటో కూడా దానిని ప్రతిబింబిస్తోంది.