Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్ను చూసి నిజం పోలీస్ ఆఫీసర్ అనుకున్నారు: యాక్షన్ కింగ్ అర్జున్

  • కురుక్షేత్రం'లో అర్జున్
  • మరోసారి పోలీస్ ఆఫీసర్ గా
  • ప్రమోషన్స్ తో బిజీగా  
తెలుగులో కొన్ని సినిమాలు చేసిన అర్జున్ .. ఆ తరువాత తమిళ సినిమాలతో బిజీ అయ్యారు. అక్కడ స్టార్ డమ్ తెచ్చుకున్న ఆయన, తన సినిమాల అనువాదాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అర్జున్ చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించారు. పోలీస్ పాత్రల్లో ఆయన జీవిస్తారని అభిమానులు చెబుతుంటారు. తన తాజా చిత్రం 'కురుక్షేత్రం'లోను ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "ఒకసారి నేను ఒక సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నాను. పోలీస్ డ్రెస్ లోనే కారులో షూటింగుకి బయలుదేరాను. మార్గమధ్యంలో ఒక పోలీస్ .. వేరే రూట్లో వెళ్లమంటూ నా కారును ఆపేశాడు. నేను కారు విండో గ్లాస్ కిందకి దించడంతో .. నేను నిజంగానే పోలీస్ ఆఫీసర్ ను అనుకుని సెల్యూట్  చేశాడు. ఆ తరువాత 'మీరు .. అర్జున్ కదూ' అంటూ నన్ను గుర్తు పట్టేశాడు" అంటూ నవ్వేశారు.    
arjun

More Telugu News