ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ.. ఫ్లెక్సీ ఫేర్ విధానానికి స్వస్తి!
- డైనమిక్ ప్రైసింగ్ విధానం తొలగింపు
- 40 రైళ్లలో పూర్తిగా ఎత్తివేత
- మిగతా 102 రైళ్లలో 60 శాతం వరకూ డిస్కౌంట్
40 రైళ్లలో డైనమిక్ ప్రైసింగ్ ను ఎత్తేస్తున్నామని వెల్లడించిన అధికారులు, మిగతా రైళ్లలో ప్రయాణానికి నాలుగు రోజుల ముందు నుంచి చివరి క్షణం వరకూ బుక్ చేసుకునే టికెట్లపై 50 శాతం డిస్కౌంట్ ను, 60 శాతం కన్నా తక్కువగా సీట్ల రిజర్వేషన్ ఉన్న రైళ్లలో గ్రేడెడ్ డిస్కౌంట్ ను అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం 44 రాజధాని రైళ్లు, 46 శతాబ్ది రైళ్లు, 52 దురంతో రైళ్లలో ఈ విధానం అమలవుతుంది. రైలు టికెట్ ధరలు భారీగా ఉండటంతో, తగ్గింపు రేట్లకు లభిస్తున్న విమానాలను ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆదాయానికి గండిపడగా, రైల్వే శాఖ ఆలస్యంగానైనా కళ్లు తెరిచిందని ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు.